కృష్ణా: పామర్రు మండలం పెరిసేపల్లిలో పేకాట శిబిరంపై సీఐ శుభాకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై రాజేంద్రప్రసాద్, ట్రైనీ ఎస్సై సత్యకళలతో కలిసి పేకాట శిబిరంపై శుక్రవారం దాడులు నిర్వహించామని సీఐ శుభాకర్ తెలిపారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి రూ.9600ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జూద క్రీడలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.