బీహార్లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. టెల్వాబజార్ హాల్ట్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో 19 బోగీలు కిందపడ్డాయి. గూడ్స్ రైలు సిమెంట్ లోడుతో అసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.