SDPT: రేపు సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీదారులు నేరుగా వచ్చి తమ వినతులను సమర్పించవచ్చని ఆమె పేర్కొన్నారు.