GNTR: గృహ విద్యుత్ వినియోగదారులు అదనపు విద్యుత్ లోడు క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని తెనాలి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెనాలి, పొన్నూరు, కాకుమాను, చేబ్రోలు, కొల్లిపర, పెదనందిపాడు మండలాల వినియోగదారులు కిలో వాట్కి రూ.1,250 చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.