జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఉల్లెంగుల సందీప్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులున్నారు.