NDL: ముక్కోటి ఏకాదశి సందర్భంగా బేతంచెర్ల శ్రీ మద్దిలేటిస్వామి ఆలయంలో సోమవారం వృషభాలకు బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఉప కమిషనర్ ఎం. రామాంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. విజేతలకు వరుసగా రూ.50వేలు, 40వేలు, 30వేలు, 20వేలు, 15 వేలు, 10వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు. ఔత్సాహికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.