MDK: తూప్రాన్ డివిజన్ ఐఓవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ ఆర్డివో జయచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. డివిజన్ స్థాయి అధికారులు, తూప్రాన్ మండల అధికారులు హాజరై ఫిర్యాదులను సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు.