KMM: కూరగాయలు, నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉండగా చికెన్, గుడ్ల ధరలు కొండెక్కుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆదివారం కిలో స్కిన్ చికెన్ ధర రూ. 245 ఉండగా, స్కిన్లెస్ రూ. 279 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 10 నుంచి రూ. 20 వరకు పెరిగాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.