TG: ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి KCR హాజరుకాకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించడం సరికాదని పేర్కొంటూ ‘తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్’ తరఫున KCRకు నోటీసులిచ్చారు. ప్రజల గొంతుకగా సభలో ఉండాల్సిన వ్యక్తి ఫామ్‌హౌస్‌కే పరిమితమవడం ప్రజలను వంచించడమేనని ఆరోపించారు.