ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 11 గంటలకు రేడియో ద్వారా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ‘వినండి. వీక్షించండి, మీ కుటుంబ సభ్యులను, సన్నిహితులు చూసేలా ప్రోత్సహించండి’ అని ఓ పోస్టర్ను విడుదల చేశారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3న మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతోంది.