ప్రకాశం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై MLA నారాయణరెడ్డి స్పందించారు. శనివారం రాత్రి పాఠశాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి హాస్టల్లో జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు.