VSP: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం శనివారం విశాఖలో ప్రమోషన్లలో సందడి చేసింది. మలయాళ హిట్ ‘జయ జయ జయహే’కు రీమేక్‌గా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను దర్శకుడు ఏఆర్ సజీవ్ తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా తీర్చిదిద్దారు. అంబటి ఓంకార్ నాయుడు, కొండవీటి ప్రశాంతి మధ్య సాగే కథ, జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.