కృష్ణా: గన్నవరం (M) చనుపల్లివారిగూడెంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు, నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని సీఐ శివ ప్రసాద్ పేర్కొన్నారు.