ASR: మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కిందపడి, తీవ్ర గాయాలు కావడంతో జీ.మాడుగులకు చెందిన ఓ మైనర్ బాలుడు (15)మృతి చెందాడని ఎస్సై సాయిరామ్ పడాల్ శనివారం తెలిపారు. జీ.మాడుగులకు చెందిన బాలుడు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సె తెలిపారు.