ADB: అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ మనందరి భాద్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ భూముల సంరక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ ప్రాంతంలో మంటల నియంత్రణ, వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.