NZB: బాన్సువాడ పోలీసులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, ఆపదలో ఉన్నవారికి, అభాగ్యులకు అండగా నిలుస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. పట్టణంలో భిక్షాటన చేస్తూ, అపరిశుభ్రంగా, సెంట్రల్ లైటింగ్ డివైడర్ వద్ద చలికి వణుకుతూ కాలం వెళ్లదీస్తున్న ఒక మహిళను చూసి చలించిపోయిన పోలీసులు, మానవతా దృక్పథంతో ఆమెకు స్నానం చేయించి, నూతన వస్త్రాలను అందించారు.