GNTR: పండుగ సెలవులకు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు ఆదివారం సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందిస్తే, వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని ఆయన తెలిపారు.