శ్రీకాకుళం జిల్లాలోని నవ భారత్ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ను బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వ్యాన్లో ఎనిమిది పశువులు ఉన్నట్లు గుర్తించిన కార్యకర్తలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎచ్చెర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు.