HYD: శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి క్యాబ్‌లో తరలిస్తున్న 5.39 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాయిచరణ్, చేతన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్‌తో పాటు 6 లిక్కర్ బాటిళ్లు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.