SKLM: కంచిలిలో శ్రీవృక్ష, ఫిజిక్స్ వాలా విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర రాష్ట్ర క్రికెట్ పోటీలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని యువజన సంఘం సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఆంధ్రా, ఒడిశా నుంచి మొత్తం 16 జట్లు పాల్గొంటాయన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా తమ వయసును తెలిపే ధ్రుపత్రాలు తీసుకురావాలన్నారు.