PLD: MLA యరపతినేని శ్రీనివాసరావును శనివారం దక్షిణ మధ్య రైల్వే డీజీఎం కోట్ల ఉదయనాథ్ కలిశారు. పిడుగురాళ్లలో జరిగిన ఈ భేటీలో ప్రాంతీయ రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. పిడుగురాళ్లలో పలు రైళ్లకు నిలుపుదల (స్టాప్) కల్పించాలని MLA కోరారు. ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యురాలు కొంక రాధా పాల్గొన్నారు.