KKD: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపే వారు, ఆ ఖర్చును సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం వెచ్చించాలని జిల్లా కలెక్టర్ షామ్మోహన్ కోరారు. జిల్లాలోని 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదువుతున్న 15 వేల మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, దోమతెరలు లేదా ఇతర వసతుల కల్పనకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.