ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు ఆదివారం కొయ్యలగూడెం మండలంలో పర్యటిస్తున్నట్లు ఎంపీడీవో కే. కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కుంతలగూడెం పంచాయతీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొని శంకుస్థాపన పూజలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కావున సంబంధిత శాఖాధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.