రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. కర్ణాటకలోని కార్వాన్ హార్బర్ నుంచి ఆమె ఈ సముద్ర ప్రయాణం చేయనున్నారు. భారత నౌకాదళ సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా, రెండు నెలల క్రితం కూడా రాష్ట్రపతి హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్లో ప్రయాణించిన సంగతి తెలిసిందే.