సత్యసాయి: అగళిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి. దీక్షిత కౌశల్-2025 రాష్ట్ర స్థాయి సైన్స్ పోటీలో క్విజ్ విభాగంలో పాల్గొని రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతులమీదుగా ప్రశంసా పత్రం, రాష్ట్ర స్థాయి మెమెంటో అందుకున్నారు. దీంతో ఆమెను ఎంఈవోలు కృష్ణ మూర్తి రాజు, చంద్ర శేఖర్ అభినందించారు.