NGKL: వంగూరు మండలంలోని మాచినేనిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు భీమపాద రాజు తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్లచే బీపీ, షుగర్, ఆర్థోపెడిక్ తదితర పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.