TG: కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నిజాంపేట్- బీదర్ రోడ్డులో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు.. నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడిపోయారు. గుంతలో పడిన యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులు ఆవుటి నర్సింహులు(27), జిన్న మల్లేష్(24), మహేష్(23)గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది.