అధోముఖ స్వనాసనం శరీరాన్ని బలపరుస్తుంది, సాగదీస్తుంది. రక్త ప్రసరణను, శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, చేతులు, భుజాలు, కాళ్లు, హామ్ స్ట్రింగ్స్ వంటి కండరాలను బలోపేతం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు.