PLD: న్యూ ఇయర్ సందర్భంగా నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్టల్స్ యజమానులతో శనివారం వన్ టౌన్ సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. హాస్టళ్లలో నివసిస్తున్న పిల్లలు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా పర్యవేక్షణ పెంచాలని అన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు.