అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలన్న ప్రయత్నాలు బాధాకరమని మున్సిపల్ ఛైర్మన్ షేక్ ఫయాజ్ భాష అన్నారు. 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లానే యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల చరిత్రలో ఏర్పడిన జిల్లాను రద్దు చేయడం జరగలేదని గుర్తు చేశారు. జిల్లా లేకపోతే కరువు ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుందని,జిల్లా కోసం ఎన్ని పోరాటాలైన సిద్ధమని స్పష్టం చేశారు.