MDK: పాపన్నపేట మండలం ఎన్కేపల్లి శివారులో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి నది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేశారు.