KMR: ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్సై విజయ్ సూచించారు. ఆదివారం బీబీపేటలో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. పలువురికి జరిమానాలు విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.