ASR: కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.