KMM: గత పాలకులు తెలంగాణను దోచుకున్నారని, తాము ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని ఏదులాపురంలో మండల కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.