NZB: నవీపేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం బద్సీ గ్రామానికి చెందిన మేడ్చల్ సూర్య(18) హాస్టల్ గదిలో ఉరేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. తోటి విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణను చేపట్టామని పేర్కొన్నారు.