JGL: పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి బోయినపల్లి అనిత-శాంతపురావు దంపతులు పంచలోహ తాపడాలను బహుకరించారు. దక్షిణామూర్తి, నటరాజస్వామి చిత్రాలతో కూడిన వీటిని ఆదివారం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొని దంపతులను అభినందించారు.