NTR: వీరులపాడులోని వి. అన్నవరంలో PACS ఛైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. గత పాలకుల విధానాల వల్ల రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. రైతన్నలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహకార సంఘం ద్వారా పూర్తి అండగా నిలవాలని నూతన కార్య వర్గానికి సూచించారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.