నూతన సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల వేళల్లో మార్పులు జరగనున్నాయి. జనవరి 1 నుంచి కొత్త టైమ్ టేబుల్ అమలు చేయాలని భారత రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సహా మొత్తం 25 ప్రధాన రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకల సమయాల్లో 5 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు మార్పులు జరిగాయి.