AP: తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్(SSD) టోకెన్లను ఇవాళ్టి నుంచి రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జనవరి 7వ తేదీ వరకు ఈ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.