GDWL: పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజా విక్రయాలు, వాడకంపై నిషేధం ఉందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రాణాపాయం కలిగించే ఈ మాంజాను విక్రయించవద్దని వ్యాపారులకు, వాడవద్దని ప్రజలకు సూచించారు.