NLG: సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ మాడుగుపల్లి గ్రామస్థులు టోల్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండ నాగరాజు మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎస్సై కృష్ణయ్య వచ్చి హామీ ఇవ్వగా, గ్రామస్థులు ఆందోళన విరమించారు.