WNP: పెబ్బేరు మండల పరిధిలోని రాంపూర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 ట్రాక్టర్ల ఇసుకను శనివారం రెవెన్యూ, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎ రాఘవేంద్రరావు, ఎస్సై యుగంధర్ రెడ్డి సోదాలు నిర్వహించి ఈ నిల్వలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.