సత్యసాయి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 29 రాత్రి నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు ఇవి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. భక్తులు తూర్పుగోపురం నుంచి దర్శనానికి వెళ్లాలని, దక్షిణ గోపురం నుంచి కేవలం వీఐపీలకే అనుమతి ఉంటుందని వెల్లడించారు.