GNTR: అమరావతిలో జరీబు, నాన్-జరీబు భూములను నిబంధనల ప్రకారమే గుర్తించామని శనివారం మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్లాట్లు మార్చుకోవాలనుకునే రైతులు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే వెంటనే మార్పిడి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 42 మంది రైతులు తమ ప్లాట్లను మార్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు.