VSP: ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వంగవీటి మోహనరంగా మెమోరియల్, ర్యాంబో కిక్ బాక్సింగ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పోటీలకు వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరు కావాలని సూచించారు.