SRPT: ఆర్యవైశ్యులు వ్యాపార రంగాల్లోనే కాకుండా రాజకీయంగానూ చైతన్యవంతులు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల నియామకమైన ఎర్ర శ్రీనివాస్ ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.