శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ లైవ్ రూ.165 కాగా, స్కిన్ చికెన్-రూ.285, స్కిన్ లెస్ చికెన్-రూ.305 రూపాయలు నమోదు అయింది. దీంతో ఆదివారం మాంసాహార ప్రియులకు నిరాశ ఎదురైంది. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధరలు సుమారు రూ.40 వరకు పెరగడంతో చర్చనీయాంశంగా మారింది.