Gold and Silver Rates Today : పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం రేట్లు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం అంతా దాదాపుగా స్థిరంగా ఉన్న దీని ధరలు సోమవారం మాత్రం స్వల్పంగా పెరిగాయి. మళ్లీ నేడు దిగి వచ్చాయి. ఈ ఒక్కరోజే దీని రేటు రూ.720 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.74,580కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధర (Gold Rate) దాదాపుగా ఇలాగే కొనసాగుతోంది. పది గ్రాములు పసిడి ధర విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర చోట్ల సైతం రూ.74,580గానే ఉంది. అయితే ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనది మాత్రమే. తర్వాత మళ్లీ మారే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అలాగే కొనుగోలుదారులు ఆభరణాలను కొనుక్కోనేప్పుడు మజూరీ, రాళ్లు, జీఎస్టీ తదితరాలకు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు చాలా రోజుల తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ ఒక్క రోజే రూ.1,020 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.93.475కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల కూడా వెండి ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత వెండి, బంగారం రెండూ కూడా మార్కెట్ ప్రారంభ సమయానికి తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం 14 డాలర్లు తగ్గి ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2368 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర 30.97 డాలర్లుగా ఉంది.