ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన మొదటి అప్‌డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగో తాజాగా విడుదలైంది.
బంగారం, వెండి ధరలు మంగళవారం మార్కెట్ ప్రారంభ సమయానికి తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయి.. గత వారం పది రోజులుగా హాట్ టాపిక్ అవుతునే ఉన్నాడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు షణ్ముఖ్. అయితే.. లేటెస్ట్‌గా సిరి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
బిగ్ బాస్ ఇంట్లోకి రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఆటతో అందిరిని మెప్పించాడు. తన మాటతీరుతో, మంచితనంతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా నిలిచి..చివరికి టైటిల్ సాధించారు.
బిగ్ బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులను జారీ చేశారు.
బిగ్ బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చింది.
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రేపు వంద శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.
బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రశాంత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనితో పాటు అతని సోదరుడికి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల వెనక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు.
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయాడు అనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ఎక్కడికి పారిపోలేదని ఓ వీడియోను విడుదల చేశాడు పల్లవి ప్రశాంత్.
బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదు అయింది. రియాలిటీ షో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని, గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి అని హైకోర్టు న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమరదీప్ అభిమానులు పరస్పర దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇరువురి అభిమానులపై కేసులు నమోదు చేశారు.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అందరూ అనుకున్నట్టే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు టైటిల్ దక్కింది. అలాగే రెండో స్థానంలో అమరదీప్ నిలిచాడు. మూడో స్థానంలో శివాజీ ఉన్నారు. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తాను గెలిచిన ప్రైజ్ మనీనంతా రైతులకు ఇస్తానని ప్రకటించాడు.
100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న సంగతి తెలిసిందే.