»Japan Reports Record Spike In Potentially Deadly Bacterial Infection
STSS : ఈ బ్యాక్టీరియా సోకితే 48 గంటల్లోనే మరణం.. వణుకుతున్న జపాన్
జపాన్ని తాజాగా ఓ బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా కేవలం 48 గంటల్లోనే మనిషి ప్రాణాల్ని తీసేయగల ప్రాణాంతకమైనదట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bacterial Infection : కోవిడ్ మహమ్మారి నుంచి తేరుకుంటున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా రకరకాల బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా జపాన్ని ఓ కొత్త మహమ్మారి బ్యాక్టీరియా వణికిస్తోంది. ఇది కేవలం 48 గంటల్లోనే మనుషుల ప్రాణాలను తీసేసేంత శక్తివంతమైనది. అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకటి జపాన్‌లో(Japan ) వెలుగు చూసింది. ఇప్పుడు జపాన్‌లో ఈ కేసులు వెయ్యికి పైగా ఉన్నాయి. ఈ ఏడాది జపాన్‌లో ఈ కేసులు మొత్తం 2,500 వరకు నమోదు అయ్యాయి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో 30 శాతం మంది మరణించారని అక్కడి లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఇన్ఫెక్షన్నే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS)గా పిలుస్తున్నారు. దీన్ని జపాన్‌లోనే కాకుండా యూరప్‌లోని మరో ఐదు దేశాల్లోనూ గుర్తించారు. తాజాగా ఈ కేసులు రికార్డు స్థాయిలో(Record Spike) ఎక్కువ అవుతుండటంతో అంతా భయపడుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్(Infection) సోకిన వ్యక్తికి తొలుత పాదాలు వాపు వస్తాయి. ఆ వాపు క్రమంగా మధ్యాహ్నానికి మోకిలికి చేరుకుంటుంది. అలా చేతులు, కాళ్లలో నొప్పులు, వాపు, జ్వరం, బీపీ పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ శ్వాస కోశ సమస్యలు పెరిగి చివరికి మరణిస్తారు. 50 ఏళ్లు పైబడిన వారిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.